బీజేపీ ముసుగులో కేసీఆర్.. మద్యం అమ్మేవాళ్లు టీటీడీ బోర్డు మెంబరా? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ ఫైర్
ఢిల్లీ నుంచి కేసీఆర్ కు మొట్టి కాయలు పడ్డాయని, అందుకే బీజేపీకి అనుకూలంగా మారాడని ఆరోపించారు సీపీఐ నారాయణ. కేసీఆర్ బీజేపీ ముసుగులో ఉన్నాడని, మోదీ ఏం చెబితే
అదే చేస్తున్నాడని విమర్శించారు. తిరుపతి దేవస్థానం పరిసరాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం ఉంటే మద్యం అమ్మేవాళ్ల నే టీటీడీ బోర్డు సభ్యునిగా ఎంపిక చేశారని జగన్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మోదీ గ్రాఫ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంత వేగంగా పతనమవుతోందన్నారు. ఢిల్లీలో నారాయణ చేసిన వ్యాఖ్యలు మీడియాలో కలకలం రేపుతున్నాయి.