Sanatana Remarks Row: మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్.. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీతో పోల్చిన రాజా!
సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరో డీఎంకే మంత్రి రాజా కొత్త దుమారాన్ని రేపారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ(HIV)తో పోల్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్ వేశారు. 'జాతిహత్య' అనే పదాన్ని ఉదయనిధి అసలు ఎక్కడా అనలేదని.. అన్ని విషయాలు తెలుసుకోకుండా మోదీ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదంటూ చురకలంటించారు.