Chandrayaan-3: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే...జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్...!!
ఈరోజు చంద్రయాన్- 3కి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి.. మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించనున్నారు.ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి చంద్రయాన్ దూరం ఇప్పుడు 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. . అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే భారతదేశం పెద్ద చరిత్ర సృష్టించగలదు.