Skill Scam Case: ప్రశ్నార్థకంగా నిధుల విడుదల.. సీఐడీ విచారణలో వెలుగుచూసిన విషయాలు!
GST అక్రమాలు, విజిల్‌బ్లోయర్ నివేదికలు, షెల్ కంపెనీల్లోకి నిధులు, ఆర్థిక శాఖ ప్రమేయం, విధానపరమైన అక్రమాలు, నిధుల మళ్లింపు లాంటి విషయాలు సీఐడీ విచారణలో వెలుగుచూసినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపింది. చంద్రబాబు రూ. 371 కోట్ల కుంభకోణాన్ని పక్కాగా ప్లాన్ చేసి, డైరెక్షన్ చేసి అమలు చేశారని ఆరోపణలున్నాయి. సీమెన్స్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌లో ఎటువంటి నిధులను పెట్టుబడి పెట్టనప్పటికీ, కేవలం మూడు నెలల్లోనే ఐదు విడతలుగా రూ.371 కోట్లను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందన్న అభియోగాలున్నాయి.