Chandrababu : జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది...ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు.