Govt Warning : ఐఫోన్, ఐప్యాడ్స్ వాడుతున్నారా? అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి..లేదంటే ఈ సమస్యలు తప్పవు..!!
మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త త్వరలోనే మీ ఐఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్ కనుక అప్డేట్ చేయకపోతే అతి త్వరలోనే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని.. భారత ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. మీ ఓఎస్ కనుక అప్డేట్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.