Telangana: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి.. రామగుండం కమిషనరేట్ లో నేతల ఫిర్యాదు!
బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఖండించారు. బీఆర్ఎస్ యువ నాయకులు గడప రాకేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు
ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ ఇంకా చల్లారలేదు. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై రెవన్యూ అధికారుల దాడులు నిర్వహించారు. కొండపల్లి సరితకు చెందిన మామిడితోట, కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది.
Nalgonda Politics: హాట్ టాపిక్ గా నల్గొండ పాలిటిక్స్.. గులాబీల జాతరా? హస్తం హవానా?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పై చేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!
సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. ఒకవేళ గెలవక పోతే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు.
BREAKING: మేడ్చల్లో హైటెన్షన్.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు
మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
Telangana Elections 2023: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ..చిరుమర్తి లింగయ్య షాకింగ్ కామెంట్స్..!!
రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజానీకానికి అంతా తెలుసన్నారు. సీఎం కేసీఆర్, చేపట్టిన సక్షేంమ పథకాలే భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana Elections: నన్ను చంపేందుకే దాడి చేశారు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు
తనపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అతని అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా వంశీకృష్ణ ఇలానే దాడి చేయించారని అన్నారు. రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు అని తెలిపారు.
Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి.. పలువురికి గాయాలు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీల శ్రేణులతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.