Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో దసరా ధమాకా.. రీ ఎంట్రీ ఇచ్చింది తనే..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో దసరా స్పెషల్ ఎపిసోడ్ తో అదిరిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో దసరా సంబరాలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులంతా 'బతుకమ్మ' ఆడుతూ సందడిగా కనిపించారు. స్పెషల్ ఎపిసోడ్ సందర్బంగా బిగ్ బాస్ స్టేజ్ పై సెలెబ్రెటీ సింగర్స్, డాన్సర్స్ ఆడుతూ, పాడుతూ అదరగొట్టేశారు అలాగే నాగార్జున ఇంటి సభ్యులతో కూడా కొన్ని ఫన్ గేమ్స్ ఆడించారు. ప్రోమో అంతా చాలా ఎంటర్ టైనింగ్ గా సాగింది. కానీ చివరిలో నాగార్జున ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు..