IndependenceDay2023 : ఎర్రకోటపై జాతీయపతాకం ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!!
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఆవిష్కరించారు. మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం వరుసగా ఇది పదోసారి. మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత భారతవాయుసేనకు చెందిన హెలికాప్టర్ లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి.