BIG BREAKING: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్
వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చానని పవన్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.