AP: అసెంబ్లీలో ఆసక్తికర అంశాలు.. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే ఎమ్మెల్యేలు ఏం చేశారంటే?
చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివందనం చేయగా.. జగన్కు ప్రతి నమస్కారం చేశారు సీఎం చంద్రబాబు. సభలో ఉన్నంతసేపు జగన్ ముభావంగా కనిపించారు.