ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అధికారులు. అయితే, చంద్రబాబును సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయన తనయుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి సిట్ కార్యాలయానికి వెళ్లారు.
ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ మార్గా్ల్లో తిప్పుకుంటూ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తారు.
ఐటీ స్కామ్‌తో పాటు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో నాటి సీఎం, నేటి విపక్ష నేత చంద్రబాబుకే ముడుపులు వెళ్లాయని ఆరోపిస్తూ మనోజ్ వాసుదేవ్, ఉమేష్ గుప్తాకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తమ కూతుళ్లను చూసేందుకు సీఎం జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.