Inspiring stories: హైదరాబాద్ బాలికకు పీఎంవో నుంచి ప్రశంసలు.. ఏం చేసిందో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
Akarshana from Hyderabad: 11ఏళ్ల హైదరాబాద్ బాలిక ఆకర్షణ ఏం చేస్తుందో తెలిస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు. నిరుపేదల కోసం పుస్తకాలు సేకరించి వాటిని అందించడమే కాకుండా ఏకంగా ఏడు లైబ్రరీలను నడుపుతోంది. ఇప్పటిరవకు 5వేలకు పైగా పుస్తకాలను సేకరించిన ఆకర్షణ MNJ క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్, జువెనైల్ అండ్ అబ్జర్వేషన్ హోమ్, బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్, కోయంబత్తూర్ సిటీ పోలీస్ స్ట్రీట్ , నోలంబూర్ పోలీస్ స్టేషన్‌లోని చెన్నై బాయ్స్ క్లబ్‌లలో లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఏకంగా పీఎంవో నుంచి ప్రశంసలు అందుకుంది.