Rahul Gandhi: వాళ్లవల్లే కాలేదు...మీ వల్ల ఏమౌతుంది..మోదీకి రాహుల్ కౌంటర్ ..!!
విపక్షాల కూటమి కలిసికట్టుగా ఉంటే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 60 శాతం ప్రజలకు ప్రతిపక్ష కూటమి ప్రతినిధి అని అన్నారు. అటు ప్రధాని మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండే కాంగ్రెస్ ను ఏం చేయలేకపోయింది...ఇప్పుడు మోదీ ఏం చేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు అదానీ విషయంలో మరోసారి మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.