సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.