Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు రేపటికి వాయిదా.. కోర్టు సీరియస్
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటీషన్ ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.