Bharat Mandapam: జీ20 సమావేశాలు జరిగే భారత్ మండపం స్పెషాలిటీ ఏంటి? వైరల్ ఫొటోలు, వీడిమోలు!
ఢిల్లీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశానికి వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ . కొత్త ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)ని ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో జాతికి అంకితం చేశారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలోని మిగిలిన వేదికలన్నీ ఇన్స్టాలేషన్లు, లైట్లతో అలంకరించి ఉన్నాయి. దాదాపు 123 ఎకరాల క్యాంపస్ ప్రాంతంతో, IECC కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దది. భారత్ మండపం సుమారు రూ.2,700 కోట్ల పెట్టుబడితో నిర్మించారు.