ZEEKR: ఎలక్ట్రిక్ వెహికల్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిన తరువాత చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా దీని వల్ల వాతావరణం కూడా పొల్యూషన్ కాదని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే వీటిని కొనేందకు ముందుకు వస్తున్నారు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య వీటి ఛార్జింగ్…ఎంత ఫుల్ గా ఛార్జీంగ్ పెట్టినప్పటికీ వీటిని ఎక్కువ దూరం తీసుకుని వెళ్లడం సాధ్య పడట్లేదు. ఎందుకంటే..ఎక్కడ మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పెడుతుందో అనే ఉద్దేశంతో. దానికి ఓ పరిష్కారం కనిపెట్టింది చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం (Geely Automobile)… ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ జీకర్ అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ని ప్రపంచానికి పరిచయం చేసింది.
అసలు ఈ జీకర్ (ZEEKR) ఏంటి, ఎలా పని చేస్తోంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త సొల్యూషన్ ద్వారా బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాంతో సుమారు 500 కి.మీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని తెలుపుతున్నారు.
ఈ జీకర్ టెక్నాలజీ అనేది లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తోంది.ద ఈంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా సేవ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో అందుబాటులోకి వచ్చింది.
అయితే చైనాలోని మరో కంపెనీ లీ ఆటో తొలి ఈవీని మెగా కోసం ఛార్జింగ్ బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకుని వచ్చింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్ తో 500 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని నిపుణులు వెల్లడించారు. వేగంగా ఫాస్ట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ భారత్లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
Also read: రేవంత్ రెడ్డికి అస్వస్థత అంటూ వార్తలు.. ఖండించిన సీఎంవో