TDP Sudhir Reddy: తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే మదుసూదన్ పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాలలో భారీ ఎత్తున భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులకు సైతం ఇందులో వాటాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు, ఆలయ బోర్డు మెంబర్లు భినామీలని వ్యాఖ్యనించారు. రిటైర్డ్ ఆర్మీ వారి స్థలాలను సైతం వదల కుండా ఆక్రమించారని ఫైర్ అయ్యారు.
Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!
కాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలలోనూ భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు టిడిపి బొజ్జల సుధీర్ రెడ్డి. రైతు డికేటి ల్యాండ్ లను దౌర్జన్యం చేసి రాయించి కుంటున్నారన్నారు. ఆక్రుతి రైతులను భయభ్రాంతులకు గురిచేసి 200 ఎకరాలు లాగేసుకున్నారని మండిపడ్డారు. ఉలవలపాడులో 70 ఎకరాలు దోచుకున్నారని…ఇవన్ని చేసేది ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బినామిలేనని ఆరోపించారు. ఎలక్షన్ అఫిడవిట్ లో 1 కోటి, కారు మాత్రమే ఉన్న ఎమ్మెల్యే ఆస్తులు.. ఇప్పుడు వంద కోట్లపై మాటేనని అన్నారు.
Also Read: జగనన్న కాలనీ పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు.!
ఒక్క రేణిగుంట మండలంలోనే 5 వందల 56 కోట్లు ఆస్తులు కొట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో కలెక్టర్, ఎమ్మర్వో, విఆర్ఓ లకు వాటాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎవరూ నోరు మెదపరని అన్నారు. శ్రీకాళహస్తి లో ఒక్కో ఎమ్మర్వో 50, 60 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. తనపై ఇప్పటికి 16 కేసులు పెట్టారన్నారు శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. రాజకీయాలు బ్రస్టు పట్టాయని ధ్వజమెత్తారు. ప్రజలు మారాలి, ప్రజలు ముందుకు రావాలి… ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. నేను చెప్పిన ఆరోపణలు తప్పు అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ వ్యాఖ్యనించారు.