ISRO XPoSat Mission: శాస్త్ర సాంకేతిక రంగంలో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇందుకు నూతన సంవత్సరం తొలి రోజే వేదిక కానుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 ప్రయోగాల తరువాత ఇప్పుడు ఇస్రో జనవరి 1న అంటే సోమవారం నాడు తొలి ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని(XPoSat)ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. బ్లాక్ హోల్స్ వంటి ఖగోళ రహస్యాల గుట్టు విప్పే ఈ ప్రయోగంతో నూనత సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది ఇస్రో. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ -C58(PSLV) ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు.
అక్టోబర్‌లో గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ ‘డి1 మిషన్’ విజయవంతం అయిన తర్వాత ఈ ప్రయోగం చేపడుతోం ఇస్రో. ఈ మిషన్ జీవితకాలం దాదాపు 5 సంవత్సరాలు ఉంటుంది. PSLV-C58 రాకెట్ పేలోడ్ ‘ఎక్స్పోసాట్’తో సహా 10 ఇతర ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. వీటిని తక్కువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
రహస్యాలపై అధ్యయనం..
శ్రీహరికోట నుంచి జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు నిర్వహించే 25 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం (డిసెంబర్ 31) ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8.10 గంటలకు పీఎస్ఎల్వీ-సీ58కి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఇస్రో వర్గాలు ప్రకటించాయి. ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్పోసాట్) ఎక్స్-రే మూలానికి సంబంధించి రహస్యాలను ఛేదించడానికి, ‘బ్లాక్ హోల్స్’ రహస్యాన్ని అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. అంతరిక్ష ఆధారిత ధ్రువణ కొలతలలో ఖగోళ మూలాల నుండి ఎక్స్-రే ఉద్గారాలను అధ్యయనం చేయడానికి అంతరిక్ష సంస్థ ప్రయోగిస్తున్న మొట్టమొదటి శాస్త్రీయ ఉపగ్రహం ఇది ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు.
🚀 PSLV-C58/ 🛰️ XPoSat Mission:
The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for January 1, 2024, at 09:10 Hrs. IST from the first launch-pad, SDSC-SHAR, Sriharikota.https://t.co/gWMWX8N6IvThe launch can be viewed LIVE
from 08:40 Hrs. IST on
YouTube:… pic.twitter.com/g4tUArJ0Ea— ISRO (@isro) December 31, 2023
నాసా కూడా..
US అంతరిక్ష సంస్థ NASA కూడా డిసెంబర్ 2021 లో సూపర్నోవా పేలుడు అవశేషాలు, బ్లాక్ హోల్స్ నుండి వెలువడే కణాల ప్రవాహాలు, ఇతర ఖగోళ దృగ్విషయాలపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఎక్స్-రే ధ్రువణానికి సంబంధించిన అంతరిక్ష ఆధారిత అధ్యయనం అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంతరించుకుందని, ఈ సందర్భంలో ఎక్స్పోసాక్ట్ మిషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇస్రో తెలిపింది.
‘ఎక్స్‌పోశాట్ మిషన్’ రెడీ..
పోలారిమెట్రిక్ పరిశీలనలు, స్పెక్ట్రోస్కోపిక్ కొలతలను కలపడం ద్వారా ప్రస్తుత సైద్ధాంతిక నమూనాల పరిమితులను బ్రేక్ చేయడానికి XPoSat మిషన్ సిద్ధంగా ఉందని ఇస్రో పేర్కొంది. ఖగోళ వస్తువుల ఉద్గార విధానాలను నియంత్రించే సంక్లిష్ట భౌతిక ప్రక్రియల ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిశోధకులు అధిగమించే అవకాశం ఉందన్నారు.
Also Read: