Life Style : నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని (World Hepatitis Day) ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. హెపటైటిస్ వ్యాధి ప్రమాదం, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం జూలై 28న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హెపటైటిస్ థీమ్ ‘ఇది చర్య తీసుకోవడానికి సమయం’. హెపటైటిస్ వ్యాధి 5 రకాలుగా ఉంటుంది. హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, హెపటైటిస్-డి హెపటైటిస్-ఈ. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెపటైటిస్ వ్యాధి?(కాలేయ వ్యాధి)
హెపటైటిస్ అనేది కాలేయ వ్యాధి. వైరల్ ఇన్ఫెక్షన్ (Viral Infection) కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ (Liver Cancer) వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. కాలేయ వ్యాది రకాల్లో హెపటైటిస్ బీ, సీ అత్యంత ప్రమాదకరమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కాలేయ సంబంధిత వ్యాధులతో సంవత్సరానికి 13 లక్షల మంది మరణిస్తున్నారు. లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా ప్రతి 30 సెకన్లకు కనీసం ఒక రోగి మరణిస్తున్నారు.
- హెపటైటిస్ వ్యాధి లక్షణాలు
- ఆకలి లేకపోవడం
- జ్వరం
- కళ్ళు పసుపుగా మారడం
- వాంతులు
- కడుపు నొప్పి
- అలసట
- బరువు తగడ్డం
హెపటైటిస్ వ్యాధి కారణాలు
- హెపటైటిస్‌కు ప్రధాన కారణం మద్యం సేవించడం.
- హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ నీటి కలుషితాల వల్ల సంభవిస్తాయి. హెపటైటిస్-బి, డి రక్తం ద్వారా వ్యాపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా హెపటైటిస్‌కు కారణమవుతాయి.
హెపటైటిస్ వ్యాధి నివారణకు చర్యలు
- హెపటైటిస్ నివారించడానికి మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.
- పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. శుభ్రమైన నీటిని తాగాలి. అలాగే సరైన పరిమాణంలో నీరు తీసుకోవాలి.
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మద్యం, ధూమపానం మానుకోండి.
Also Read: Chinmayi: పిల్లాడికి లిప్ కిస్ ఇస్తావా? నీకు సిగ్గుందా? అనసూయకు ఇచ్చిపడేసిన చిన్మయి – Rtvlive.com