Hero Surya Emotional video: కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో లందరూ ఆయనకు నివాళలర్పించారు. అయితే, విజయకాంత్ మృతి చెందినప్పుడు షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్నారు స్టార్ హీరో సూర్య. నిన్న చెన్నైకు తిరిగొచ్చిన ఆయన నేడు విజయకాంత్ సమాధి వద్ద నివాళి అర్పించారు. కెప్టెన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: ‘బ్రహ్మముడి’ కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?
View this post on Instagram
నటుడు విజయకాంత్, హీరో సూర్య ‘పెరియన్నా’ అనే తమిళ సినిమాలో కలిసి నటించారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని.. ఆ సమయంలో విజయకాంత్ తో కలిసి పని చేశానని తెలిపారు సూర్య. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన ప్రోత్సహించేవారని చెప్పుకొచ్చారు. అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని అన్నారు. విజయకాంత్ మరణం తనను షాక్ కు గురి చేసిందని.. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.