Leo movie: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి నటిస్తున్న’లియో’ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 19 న విడుదల పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ‘లియో’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ‘లియో’ ట్రైలర్ కు ఆడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై కూడా ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. గతంలో దళపతి నటిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఒక ప్రధాన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత సినిమాలో రాంచరణ్ పాత్ర పై వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ కొట్టిపడేసారు.
అయితే ఇప్పుడు రాంచరణ్ పాత్ర నిజంగానే ఉంది అనడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇప్పటికే లియో సినిమాకు సంబందించిన అడ్వాన్స్ మూవీ టికెట్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. టికెట్ బుకింగ్స్ కు సంబందించిన ఓ వెబ్ సైట్ లో మూవీలో నటిస్తున్న వారి పేర్లలో హీరో రాంచరణ్ పేరు కూడా ఉంది. దీంతో రాంచరమ్ విజయ్ సినిమాలో క్యామియో రోల్లో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. వైరలవుతున్న ఈ వార్తలో అవాస్తవాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సినీ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
కోలీవుడ్ స్టార్, టాలీవుడ్ స్టార్ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిండం అంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ వచ్చే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరిగి రాయడం ఖాయము. ఈ సినిమాలోని సన్నివేశాలు హై స్టాండర్డ్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో తెరక్కెక్కిస్తున్నట్లు సమాచారం. గతంలో లోకేష్ కానగరాజు దర్శకత్వలో వచ్చిన ‘విక్రమ్’ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాదించనున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి