Beauty Secret: అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందులో మహిళలు ముందుంటారు. కానీ ఈ మధ్యకాలలో ఆడమగ అనే తేడా లేకుండా అందరూ అందంపై ఫోకస్ పెట్టారు. నలుగురిలో స్పెషల్ గా కనిపించేందుకు మార్కెట్లో దొరికే ప్రొడక్టులన్నీ కొనుగోలు చేస్తుంటారు. అందం కోసం పదిరూపాయలు ఎక్కువైనా సరే పర్లేదు అనుకునేవాళ్లు బోలేడు మంది ఉన్నారు. అయితే కొందరు చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. మరికొంతమంది మూడుపదుల వయస్సు దాటినా 16ఏళ్ల పిల్లలనే కనిపిస్తుంటారు. కానీ ఇది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. మెరుగైన చర్మ సంరక్షణ, ఫిట్నెస్ కారణంగా కొందరు అసలు వయస్సు కంటే యవ్వనంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తుంటారు. అలాంటి వారిలో 59ఏళ్ల విక్కీ డిరోసా(Vicki DeRosa) అనే మహిళ కూడా ఉన్నారు.
బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్(beauty influencer) అయిన విక్కీ డిరోసా ఈ మధ్యే తన చర్మ సౌందర్యం(Skin beauty) గురించి సీక్రెట్ బయటపెట్టింది. ఆ సీక్రెట్ ఏంటి..యవ్వనంగా ఉండేందుకు ఎలా కనిపించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిరోసా ఈమధ్య ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెయిలీ స్టార్(Daily Star) తో మాట్లాడారు. తాను ఖరీదైనా క్రీమ్ లు, పౌడర్లు, ఫిల్లర్లు లేదా బోటాక్స్ కోసం డబ్బు ఖర్చు చేయనని చెప్పారు. ముఖానికి ఆవిరి మాత్రమే పడుతుందట. ఆవిరి పట్టే సమయంలో తెల్లటి స్మూత్ ఫ్లాన్నెల్ టవల్ ని ఉపయోగిస్తానని చెప్పింది. ఆమె టవల్ ను వేడి లేదా గోరువెచ్చని నీటిలో నానబెట్టి పిండుకుని కొన్ని నిమిషాల పాటు ముఖంపై ఉంచుతారట.
తర్వాత నెమ్మదిగా ముఖాన్ని తుడుముతూ మరో టవల్ తో తన ముఖాన్ని పొడిగా తయారు చేసుకుంటానని చెప్పారు. టవల్ తో ముఖాన్ని రుద్దడం వల్ల చర్మం దెబ్బతింటుందని హెచ్చరిస్తోంది. ముఖంగా పొడిగా అనిపించినప్పుడు మాత్రమే మాయిశ్చరైజర్ చేస్తుందట. యవ్వనమైన చర్మం మెయిటైన్ చేయడం అందరికీ సాధ్యమేనని చెబుతోంది.
కాగా విక్కీ అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో నివసిస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ హ్యాక్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది దానిని మేమూ ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఇలాంటి సహజమైన ఖర్చులేని హ్యాక్ షేర్ చేసినందుకు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
అయితే కొందరు చల్లనినీరు కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుందని పేర్కొంటున్నారు. కొన్నాళ్ల క్రితం 70 వృద్ధురాలు తన యాంటీ ఏజింగ్ టిప్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఆమే మేనకోడలు బ్రిటనీ అలెన్ టిక్ టాక్ లో ఇన్ ఫ్లుయెన్సర్ గా రాణిస్తోంది. తన అత్తను పరిచయం చేసింది ఆమె. చాలా యంగ్ గా కనిపించేలా చేసే బ్యూటీ టిప్స్ షేర్ చేయాలని ఆమె తన అత్తను కోరడంతో ఆమె మూడు సింపుల్ టిప్స్ గురించి చెప్పింది.
స్కిన్ పై కఠినంగా ఉండే మేకప్స్ వైప్స్ వాడకూడదు…చర్మాన్ని సాగదీయకూడదని చెప్పింది. రెటినోల్ లోషన్ అప్లయ్ చేయాలి. ఈ లోషన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుందని చెప్పింది.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!!