Jai Shri Ram : జనవరి 22న అయోధ్య(Ayodhya) లో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath), 4వేలకు పైగా వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. ఇప్పుడు జైశ్రీరామ్ నినాదం భారతదేశంలోనే కాదు ఖండాంతరాలను దాటి ప్రతిధ్వనిస్తోంది. భారత్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో రామాలయం ప్రారంభోత్సవం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా లో ‘జై శ్రీరామ్'(Jai Shri Ram) నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రాణ ప్రతిష్టపై అమెరికాలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. రామమందిర శంకుస్థాపనకు ముందు హ్యూస్టన్ లో భక్తులు ఎంతో ఉత్సాహంతో కారు ర్యాలీ(Car Rally) చేపట్టారు. హిందూ అమెరికన్ కమ్యూనిటీ(Hindu American Community) సభ్యులు ఆదివారం హ్యూస్టన్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు మధ్య ఈ అద్భుతమైన భారీ కార్ ర్యాలీని చేపట్టారు.
500 మందికి పైగా భారీ ర్యాలీ:
ఈ ర్యాలీ 11 దేవాలయాల గుండా సాగింది. జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అమెరికాలోని విశ్వహిందూ పరిషత్(VHP) ఆలయ నిర్వాహకులకు అధికారికంగా ఆహ్వానం పంపింది. రామ మందిరం, భారత జెండా(Indian Flag), అమెరికా జెండా(American Flag) చిత్రాలతో కూడిన కాషాయం రంగు బ్యానర్లతో 500 మందికి పైగా 216 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం నుండి హ్యూస్టన్ పరోపకారి జుగల్ మలానీ జెండా ఊపి రిచ్మండ్లోని శ్రీ శరద్ అంబా టెంపుల్ వద్ద మధ్యాహ్నం ముగించారు.
2 వేల మందికి పైగా 11 ఆలయాల్లో ర్యాలీ:
హ్యూస్టన్(Houston) లో రద్దీగా ఉండే వీధులను దాటి ర్యాలీని నడిపించారు. జై శ్రీరామ్(Jai Shri Ram) నినాదాలతో చేపట్టిన ర్యాలీ 6 గంటల్లో 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు 2 వేల మంది ఆలయాల్లో సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ ‘జై శ్రీరాం’ నినాదం, శంఖ ధ్వనులతో మంత్రముగ్ధులయ్యారు. ఈ క్షణాన్ని రామభక్తులు ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగారు. హ్యూస్టన్ వాలంటీర్లు అచలేష్ అమర్, ఉమంగ్ మెహతా, అరుణ్ ముంద్రా మొదటిసారిగా ఇటువంటి ర్యాలీని నిర్వహించారు. వీహెచ్పీఏ సభ్యుడు అమర్ మాట్లాడుతూ హ్యూస్టన్వాసుల హృదయాల్లో శ్రీరాముడు జీవించేవాడన్నారు. కార్ల ర్యాలీలో పాల్గొన్న వారికి వివిధ దేవాలయాల వద్ద 2500 మందికి పైగా తరలివచ్చిన భక్తులు చూపిన భక్తి, ప్రేమ ఉప్పొంగింది.
#RamMandirPranPratishtha
250 cars rally in Houston, USA 😇#JaiShreeRam 🔥 pic.twitter.com/UMNGcL5Ult— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) January 8, 2024
ఇది కూడా చదవండి: కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిసిందోచ్…అదేంటో తెలుసా?
హ్యూస్టన్కి ‘శ్రీరాముడు వచ్చాడు’ అనిపించింది:
ఉమంగ్ మెహతా మాట్లాడుతూ, అమెరికాలో భక్తి వాతావరణం నెలకొంన్నారు. శ్రీరాముడే స్వయంగా హ్యూస్టన్ చేరుకున్నట్లు అనిపించిందన్నారు. ఆలయ నిర్వాహకులకు అందమైన ఆహ్వాన పత్రాన్ని అందించినట్లు ముంద్రా తెలిపారు. ఈ బుట్టలో VHP నుండి అధికారిక ఆహ్వానం, అయోధ్య నుండి పవిత్ర బియ్యం, రామ్ పరివార్, గంగాజలం, సుందర్ కాండ్ కాపీ, కొన్ని స్వీట్లు ఉన్నాయి.