Venu Madhav: కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేశాడు వేణుమాధవ్ (Venu Madhav). షార్ట్ టైమ్ లోనే కమెడియన్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సంపాదించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా హవాను చూపించాడు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఎంతో జీవితం ఉన్న వేణుమాధవ్ పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే మరణించి అందరికి దురమయ్యాడు.
స్టార్ కమెడియన్ వేణు మాధవ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సొంత ఊరు కోదాడలో వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ వేశారు. ఈ వాల్ ఆర్ట్ చూసిన వేణు మాధవ్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతే కాకుండా వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ (Venu Madhav Wall painting) వేయించినందుకు మంత్రి కేటీఆర్ (KTR) కు హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Also Read: ఆ స్టార్ ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీవెడ్డింగ్ పార్టీ..సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!!
View this post on Instagram
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరు. వేణు మాధవ్ సినీ రంగంలో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకోవడంతో పాటు ఎంతో డబ్బు కూడా సంపాదించారు. నితిన్ హీరోగా నటించిన సై సినిమా (Sye Movie) లో నల్లబాలు నల్ల తాచు కింద లెక్క అన్న ఒక్క డైలాగ్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు వేణుమాధవ్. ఆది, ఛత్రపతి, లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.
Also Read: సెట్స్ లో ఎవరూ లేని సమయంలో శ్రీలీల ఆయనను అలా పిలుస్తుందట..!!
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ (Laxmi Movie) సినిమాలో చేసిన సత్తన్న పాత్రకు నంది అవార్డు సైతం వరించింది. కమెడియన్గా మంచి ఫాంలో ఉండగానే హీరోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వేణుమాధవ్. తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు. తరువాత భూకైలాష్, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించారు వేణు మాధవ్.
అయితే, ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణం ఆయన అభిమానులకే కాకుండా ఇండస్ట్రీకే విషాదాన్ని నింపింది. హాస్యనటుడు వేణు మాధవ్ మరణించిన తర్వాత.. ఆయన చావు గురించి ఎన్నో రకాల ప్రచారాలు వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆయన తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి చనిపోయారనే ప్రచారం జరిగింది. మరికొందరైతే వేణు మాధవ్ ఓ ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా మృతి చెందారని కూడా అన్నారు. దీంతో ఇది అప్పట్లో సంచలనం అయిపోయింది.