సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కంటోన్మెంట్ లో తాను ఖచ్చితంగా గెలుస్తానంటూ వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని వెన్నెల అన్నారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న కంటోన్మెంట్ ను బద్దలు కొట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కంటోన్మెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న వెన్నెల ఇంటర్వ్యూ వీడియోను పూర్తిగా చూడండి.