Saindhav : ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న (venkatesh) విక్టరీ వెంకటేష్ 75 వ సినిమా (Saindhav) సైంధవ్. శైలేష్ కొలను (sailesh kolanu) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ సక్సస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.. హిట్ ఫ్రాంచైజీస్ తో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న శైలేష్ కొలను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలా సార్లు బల్లగుద్దిమరీ చెప్పారు.
దృశ్యం లానే తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ సైంధవ్
తండ్రీ కూతురు మధ్య ఉన్న బాండింగ్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో అర్ధమయింది. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శైలేష్ మాటలనుబట్టి చూస్తే సినిమాకు తిగులేదని వెంకీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే గతంలో వెంకీ చేసిన దృశ్యం మూవీ కూడా ఫ్యామిలీ డ్రామానే కావడం .. థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా కూతురి జీవితంలో జరిగిన ఓ సంఘటన కోసం ఓ తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. దృశ్యం రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు వచ్చే ఈ చైల్డ్ సెంటిమెంట్ గ్యారంటీగా వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు మేకర్స్.
Also Read:వాల్తేరు వీరయ్య 365 డేస్ ..మెగా రికార్డ్
Just delivered the final domestic copies. Saindhav is yours now. I just wanted to share something with you and I am saying this with utmost humility and politeness. The last 20 minutes of #Saindhav will remain as one of the best pieces of cinematic experiences anyone could have…
— Sailesh Kolanu (@KolanuSailesh) January 10, 2024
ఫైనల్ కాపీలు డెలివర్ చేసామని ఇక సైంధవ్ మీది
సైంధవ్ మూవీ గురించి . శైలేష్ కొలను ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇస్తూ వెంకీ ఫ్యాన్న్స్ లో జోష్ నింపుతున్నాడు. ఈ క్రమంలో
ఈ మూవీపై శైలేష్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. సినిమా తాలూకా ఫైనల్ కాపీలు డెలివర్ చేసామని ఇక సైంధవ్ మీది అంటూ అని ఆడియెన్స్ కి చెప్తూ ఓ పోస్ట్ పెట్టాడు. . సైంధవ్ చిత్రంలో చివరి 20 నిమిషాలు మాత్రం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది అని అలాగే అది కేవలం ఒక్క మా వెంకటేష్ గారి వల్లే సాధ్యం అయ్యిందని , ఒక నటుడు తాలూకా ఫైనెస్ట్ పెర్ఫామెన్స్ ని నేను తెరకెక్కించానని భావిస్తున్నాని, అలాగే నేనేం చెప్తున్నానో దానిని జనవరి 13న థియేటర్స్ లో అందరూ తెలుసుకుంటారు. అప్పుడు కలుద్దాం అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.
ఇంద్రప్రస్థ అనే ఫిక్సనల్ టౌన్
స్పెనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే అరుదయిన వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను తన తండ్రి ఎలా కాపాడుకున్నాడు అనే కథతో ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఇంద్రప్రస్థ అనే ఫిక్సనల్ టౌన్ నిర్మించినట్లు సమాచారం. ఈ సంక్రాతికి రిలీజవబోతోన్న నాలుగు చిత్రాల్లో సైంధవ్ ప్రత్యేకంగా నిలవడం ఖాయం అంటూ వెంకీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ చిత్రం సముద్ర తీరంలో జరిగే భారీ డ్రగ్ కార్టెల్స్ , గన్ బిజినెస్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ జరగాలి. అందుకోసమే ఇంద్రప్రస్థ ఫిక్సనల్ టౌన్ క్రియేట్ చేశామని, ఈ సినిమాకోసం చాలా నైట్స్ షూటింగ్ చేశామని, వెంకటేష్ గారి సపోర్ట్ మరచిపోలేనని శైలేష్ మీడియాతో వెల్లడించారు. ఈ మూవీలో వెంకటేష్ సరసన శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్నారు.
Also Read:రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్