Vegh S60 Electric Scooter Launched: భారీగా పెరిగిన ఇంధన(Fuel Price) ధరలు ప్రజలను బెంబేలెత్తించాయి. బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా జనాలంతా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్(Electric Vehicles) వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ అందిస్తూ.. ప్రజలు వీటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వలన ఇంధనం ధరల బాద తగ్గడంతో పాటు.. ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుంది. అయితే, ప్రజల ఆసక్తుల దృష్ట్యా.. అనేక ఆటోమొబైల్ కంపెనీలు.. రకరకాల ఎలక్ట్రిక్ బైక్స్‌ని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు మొదలు.. వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సూటర్లను చాలా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్‌తో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా వేగ్ ఆటోమొబైల్స్.. హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్60(Vegh S60) ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1.25 లక్షలు(ఎక్స్-షోరూమ్). కంపెనీ అధికారిక డీలర్షిప్ నుంచి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. అలాగే కంపెనీ తన అప్‌గ్రేడ్ వేరియంట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
వేగ్ ఎస్60 ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్ ఆప్షన్స్..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగుల్లో మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో మ్యాట్ బ్లాక్, లైట్ గ్రే, వైట్, లైట్ గ్రీన్ కలర్స్‌లో ఇ-స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి.
వేగ్ S60 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంజిన్ కెపాసిటీ..
ఈ స్కూటర్ AIS156 ఫేజ్ 2 స్టాండర్డ్‌తో 3 kWh బ్యాటరీని కలిగి ఉంది. వేగ్ S60 హైస్పీడ్ కెపాసిటీ కలిగి ఉంది. అంతేకాదు.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 + కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ స్కూటర్ 2.5 KW మోటార్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కలిగిన ఈ స్కూటర్ బ్యాటరీ.. 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
వేగ్ S60 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో డిజిటల్ డిస్ప్లే, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, త్రి రైడింగ్ మోడ్లు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు ప్రకారం.. దీనిని ఉపయోగించవచ్చు. నగరంలో, గ్రామంలో ఏ రోడ్లపైనైనా.. మంచి రేంజ్ వస్తుంది. దీని సీటు కూడా పెద్దగా ఉండటంతో పాటు.. హైడ్రాకిల్ సస్పెన్షన్ సదుపాయం కూడా ఉంది.
ఆ కంపెనీలకు పోటీ..
వేగ్ ఎస్60 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Ather 450X, Ola S1 Pro, TVS iQube Electric వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Vegh is more than a scooter; it’s a conscious choice. By embracing Vegh, you’re not just riding; you’re leading the way towards a greener, eco-aware society. Join us as we pave the path to a sustainable tomorrow, one electric journey at a time. pic.twitter.com/lIHXjWKxB8
— Vegh Automobiles (@VeghAutomobiles) September 8, 2023
Also Read:
PM Vishwakarma Scheme: ‘పీఎం విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
Asia Cup 2023 final Live Score🔴: టాస్ ఓడిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్