MEGA 156 TITLE VISWAMBHARA RELEASE : సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక ఇచ్చారు చిరంజీవి(Chiranjeevi). గతేడాదికి వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా మెగాభిమానులకు తిరుగులేని హిట్ ఇచ్చింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయే సరికి మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ అదిరిపోయే అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు (Vassishta) వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతోన్న మెగా 156 టైటిల్ విషయంపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.(Vishwambhara)విశ్వంభర అనే టైటిల్ ఖరారైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్ గా అదే టైటిల్ కన్ఫైర్మ్ చేసి రిలీజ్ చేశారు.
అసలు సిసలు సంక్రాంతి గిఫ్ట్..విశ్వంభర
సంక్రాంతి కానుకగా మెగా స్టార్ ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదంటూ సంబరాలు చేసుకుంటున్నారు.మొత్తానికి ఇన్ని రోజుల ఎదురుచూపులు ఫలించాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
2025 సంక్రాంతి బరిలో రిలీజ్..
ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి (MM Keeravaani)సంగీతం సమకూర్చుతుండగా ..(Chandraboss)చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్న పాట రికార్డింగ్‌తో సినిమా పూజాకార్యక్రమాలతో చిత్రం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ మూవీని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ చేసేపనిలో దర్శకుడు వశిష్ఠ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బింబిసార బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న ప్రాజెక్టు కావడం ఒక ఎత్తు అయితే.. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ లాంటి సోషియో ఫాంటసీ చిత్రం తరువాత ఆ జానర్ లో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ద తీస్కుని వర్క్ చేస్తున్నాడు వశిష్ఠ. మెగా స్టార్ చిరంజీవి టాప్ 10 చిత్రాల్లో టాప్ 3 లో ఈ మూవీ ఉండే విధంగా తెరకెక్కిస్తానని దర్శకుడు వశిష్ఠ ఆశాభావం వ్యక్తం చేశారంటే ..ఆడియన్స్ లో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో తెల్సిందే. ఈ విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి (Sankranthi 2025)విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. టైటిల్ రిలిజయి కొద్దిసేపే అయినా ట్రెండింగ్ అవుతోంది.
డ్యూయల్ రోల్ లో చిరు..
ఈ మూవీలో చిరుకి జోడిగా త్రిష అలరిస్తుండగా .. మరో ముగ్గురు హీరోయిన్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ అయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ లోకి వెళ్లనుంది. చిరు ద్విపాత్రల్లో అలరించనున్నారని సమాచారం. వెండితెరపై ఒక.. చిరంజీవినే చూస్తుంటేనే పూనకాలు వచ్చేస్తాయి. మరి.. డ్యూయల్ రోల్స్ లో చిరు ఆంటే పూనకాలు రెండు రెట్లు పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope – 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫#Mega156 is #Vishwambhara ❤️🔥
Title and concept video out now!
– https://t.co/hm9wO9nyawIn cinemas Sankranthi 2025.@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota… pic.twitter.com/fOyCDIMV3M
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024
అనీల్ రావిపూడి డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ..
వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి రీసెంట్ గా భగవంత్ కేసరి అంటూ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత అనీల్ చిరు కు స్టోరీ నేరెట్ చేసి ఒప్పించడం జరిగిందని సమాచారం. స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. అనీల్ రావిపూడి మార్క్ ఉంటూనే చిరు స్టామినాను రెట్టింపు చేసే చిత్రం అవుతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. సో..ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో చిరు ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని చిరు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తారని అనౌన్స్ కూడా చేశారు. ఏమైందొ ఏమో ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కలేదు. మరి ..అనీల్ రావిపూడి చిత్రానికి సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తారా ? లేదా వేరే నిర్మాతలు నిర్మిస్తారా అనేది చూడాలి. మొత్తానికి సైలెంట్ గా పండగ ట్రీట్ ఇవ్వడంతో దట్ ఇజ్ మెగాస్టార్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.