Varun Tej: శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సోనీ పిక్చర్స్ (Sony Pictures) బ్యానర్ పై సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మానుషీ చిల్లర్ (Manushi Chhillar) కథానాయికగా, నవదీప్, మీర్ సర్వర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఫిబ్రవరి 16 న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో వాయిదా పడింది. కాగా ఇటీవలే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2024 మర్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ వేగం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో సినిమాలోని ‘గగనాల తేలేను నీ ప్రేమలోన’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు హీరో వరుణ్ తేజ్ (Varun Tej) సమాధానం ఇచ్చారు. మీ ఫెవరెట్ హీరోయిన్ ఎవరు అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు వరుణ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
లావణ్య నా ఫెవరెట్ హీరోయిన్
“నా ఫెవరెట్ హీరోయిన్నే నేను పెళ్లి చేసుకున్నానని బదులిచ్చారు. ఇండైరెక్ట్ గా తన ఫెవరెట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అని చెప్పారు. మంచి స్టోరీస్ వస్తే.. నేను లావణ్య కలిసి చేస్తామని.. తానే ఫస్ట్ ప్రపోజ్ చేశానని తెలిపారు. అయితే లావణ్య త్రిపాఠి కాకుండా వరుణ్ తేజ్ కు సాయి పల్లవి (Sai Pallavi) అంటే అభిమానమని చెప్పారు. ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడిన వరుణ్ .. “ఎయిర్ ఫోర్స్ (Air Force) బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మొదటి సినిమా ఇది.. కామెడీ మూవీ వంద చేయొచ్చు. కానీ దేశం కోసం.. ఏదీ చేసిన గొప్పగా ఉంటుంది. ఆపరేషన్ వాలెంటైన్ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు”.