Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరో హీరో శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో క్రాక్, వీరసింహరెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా సాగుతోంది.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం
అయితే 38 ఏళ్లు కలిగిన ఈ ముద్దు గుమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా గ్యాలరిస్ట్ నికోలై సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చి 1న ముంబై లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈమె నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. వరలక్ష్మి కాబోయే భర్తపేరు నికోలాయ్ సచ్ దేవ్. ఇతను ఫేమస్ గ్యాలరిస్టు అని సమాచారం. గత 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Congratulations #VaralaxmiSarathKumar on her engagement with #NicholaiSachdev, a Mumbai based (Art) Gallerist. Best wishes for the wedding set to happen later this year! pic.twitter.com/t8ORb8rCEK
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 2, 2024
Also Read: SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా