చిన్నారి పెళ్లి కూతురు ఆనంది అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ప్రతి ఇంట్లో చిన్నారి పెళ్లి కూతురు ని ఆదరించేవారు. ఆ సినిమాలో చిన్నారి పెళ్లి కూతురు ఆనంది గా అలరించిన అవికాగోర్ (Avikagor)..ఆ తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి నటిగా తనదైన ముద్ర వేసింది. అయితే చాలా రోజుల గ్యాప్ తరువాత మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ చిన్నారి ఆనంది. ఇది విడుదలై మంచిగా నడుస్తున్న క్రమంలోనే మరో వెబ్ సిరీస్ ని లైన్ లో పెట్టింది ఈ ముద్దు గుమ్మ.
తాజాగా అవికా నటిస్తున్న వధువు (Vadhuvu)..మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. దీనిలో నటుడు అలీరేజా, నందు ముఖ్య పాత్రలు పోషించారు. దీని నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 8 న విడుదల కానుంది.
ఈ క్రమంలోనే దీనిని ప్రమోట్ చేసే కార్యక్రమంలో అవికా చాలా బిజీబిజీగా ఉంది. కొన్ని కార్యక్రమాల్లో అవికా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వధువు …సిరీస్ ని థ్రిల్లర్ జానర్ లో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించినట్లు తెలిపింది. బెంగాలీలో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ గా నిలిచిన ” ఇందు ”ని తెలుగులో వధువుగా చేసినట్లు వివరించింది.
ఈ క్రమంలోనే అవికా మరికొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. పదేళ్ల వయసులో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో నటించాను. ఆ వయసులో అసలు పెళ్లి అంటే ఏంటో కూడా నాకు సరిగ్గా తెలీదు. డైరెక్టర్ ఏం చెబితే అదే చేసేదాన్ని. వధువు పేరుతో ఈ స్టోరీ చెప్పగానే నాకు ముందుగా చిన్నారి పెళ్లి కూతురే గుర్తుకు వచ్చింది. కానీ ఇది ఓ భిన్నమైన కథ.
ఇది థ్రిల్లర్ కథగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఎందుకు జరిగింది అనేది ప్రేక్షకులకు ప్రశ్న మొదలవుతుంది. అంతేకాకుండా తనకి పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం కావడం అంటే చాలా ఇష్టమని చెప్పింది. సినిమాలే కానీ, సీరియల్స్ లోనే కానీ ఇప్పటి వరకు 20 సార్లు పైగా పెళ్లి చేసుకున్న అని చెప్పింది.