22 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11, 2001న, ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి అయిన అమెరికా తీవ్రవాద దాడులతో వణికిపోయింది . ఈ చీకటి రోజు ఇప్పటికీ ప్రజల మనస్సులలో ఉంది. చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఆ రోజును గుర్తుకు తెచ్చుకుంటారు.సెప్టెంబరు 11, 2001 (9/11 దాడి) న అమెరికాలో ఏమి జరిగిందో మరచిపోలేము. ఈ రోజున ప్రపంచం అత్యంత భయంకరమైన రూపాన్ని చూసింది. ఎన్నో కుటుంబాలు ధ్వంసమై వందలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా రెండు హైజాక్ చేసిన విమానాలను ఉపయోగించి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై వైమానిక దాడి చేసింది. ఈ దాడి భారీ వినాశనానికి కారణమైంది.
మూడవ వాణిజ్య జెట్ పెంటగాన్‌ను ఢీకొట్టింది, 184 మంది మరణించారు. ప్రయాణీకుల తిరుగుబాటు తరువాత నాల్గవ విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లేలో ఒక పొలంలో కూలిపోవడంతో 40 మంది మరణించారు. దాదాపు రెండు శతాబ్దాల్లో అమెరికా గడ్డపై జరిగిన తొలి విదేశీ దాడి ఇది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో మరణించినవారిలో భారతదేశానికి చెందినవారు ఎంతో మంది ఉన్నారు. ఇందులో కేరళకు చెందిన ఓ యువతి మరణం మిస్టరీ క్రియేట్ చేసింది. ఆమె మరణం గురించి ఘటన జరిగిన 7ఏళ్ల తర్వాత కూడా చర్చించుకున్నారంటే…ఆమె మరణం వెనకున్న డెత్ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్ స్నేహ అన్నే ఫిలిప్ అనే యువతి కేరళలో జన్మించింది. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. అక్కడే రాన్ లీబర్‌మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. వారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, న్యూయార్క్ వెళ్లారు. 2001లో, స్నేహ సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 2001 సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. వారం రోజుల క్రితం వారిద్దిరి మధ్య గొడవ జరిగింది…అదే కోపంతో స్నేహ తన సోదరుడి ఇంటికి వెళ్లిందని రాన్ భావించాడు. అప్పుడే ట్విన్ టవర్స్ పై దాడులు జరిగాయి.
ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో బలమైన భూకంపం, సునామీ వస్తుందా?
అయితే పెంటగాన్ బిల్డింగ్ మొత్తం ఒకేసారి కుప్పకూలలేదు. ఈ ఘటనలో ఎంతో మంది తీవ్రంగా గాయపడ్దారు. క్షతగాత్రులను రక్షించేందుకు స్నేహ కూడా అక్కడికి వెళ్లింది. సహాయక చర్యల్లో నిమగ్నమైన సమయంలో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈ ఘటనలో స్నేహ కూడా మరణించింది అంతా భావించారు. పోలీసులు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. కానీ ఈ ఘటనలో స్నేహ మరణించలేదని..ఎక్కడో తప్పిపోయిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కేసును మళ్లీ రీకన్ స్ట్రక్షన్ చేశారు.
అయితే ఈ కేసును పోలీసులు ఎందుకంత సవాల్ గా తీసుకున్నారంటే…స్నేహ ఆమె భర్తకు మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. స్నేహ ఇంటికి రాకుండా తన సోదరుడికి ఇంటికి వెళ్లేది. అందుకే తన భర్త పట్టించుకోలేదట. కానీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలినప్పుడు తన భర్తకు అనుమానం వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో అక్కడికి వెళ్లిందని.అక్కడే ప్రాణాలు కోల్పోయిందని తన భర్త అనుకున్నారు. కానీ భర్తకు అనుమానం వచ్చి తన పేరును మళ్లీ జాబితాలో చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ మాన్హాటన్ సర్రోగేట్ కోర్ట్ అతని దరఖాస్తును తిరస్కరించింది.
ఇది కూడా చదవండి:ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్
పోలీసుల రిపోర్టును స్నేహ కుటుంబం తీవ్రంగా ఖండించింది. పోలీసులు తన వాంగ్మూలాన్ని కల్పించారని ఆమె సోదరుడు జాకబ్ పేర్కొన్నారు. మాన్హాటన్లోని ఒక బార్లో సహోద్యోగుల బృందంతో కలిసి ఉన్నప్పుడు కాబ్రిని మెడికల్ సెంటర్‌కు చెందిన తన సహోద్యోగులలో ఒకరు తనను పట్టుకున్నారని, ఆమె అతనిని కొట్టిందని రాన్ చెప్పింది. తన భార్యకు జరిగిన విషయం చెప్పడానికి ఆ రాత్రి తర్వాత ఆమె తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లిందని, మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతను చెప్పాడు. సహోద్యోగి ఆరోపణలను ఖండించారు. పోలీసు విచారణలో స్నేహ వాదన తప్పు అని నిర్ధారించారు. ఒక సంఘటనను తప్పుగా నివేదించడం, అతిక్రమించడం, దాడి చేయడం, వేధింపులకు పాల్పడినట్లు ఆమెపై అభియోగాలు మోపారు.
ఇది కూడా చదవండి: హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి…!!
ఈ సంఘటన ఆమెను డిప్రెషన్లోకి నెట్టి మద్యం సేవించడం ప్రారంభించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె డిప్రెషన్లో ఉన్నారని, అదృశ్యమైన సమయంలో ఆమెకు తీవ్రమైన సమస్యలు లేవని కూడా వారు చెబుతున్నారు. స్నేహ చివరిసారిగా సెంచరీ 21 అనే స్టోర్‌లో షాపింగ్ చేసింది.స్నేహ కుటుంబం 9/11 బాధితుల జాబితాలో ఆమె పేరును చేర్చాలని పోరాడింది. ఏడేళ్ల తర్వాత 2008లో కోర్టు స్నేహ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోనే మరణించినట్లు నిర్దారించడానికి రుజువులు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఊహగానాలన్నీ నిజాలు కావాని జస్టిస్ డేవిడ్ సాక్స్ తీర్పునిచ్చారు. 9/11లో విక్టిమ్స్ లో మలయాళీ స్నేహ గురించి అమెరికా మొత్తం చర్చించుకుంది. స్నేహ మిస్సింగ్ చాలా మిస్టరీగా మారింది. అమెరికా మొత్తం దాదాపు 7 నుంచి 8 ఏళ్ల పాటు చర్చించుకుంది.