Viral News: మిల్క్ షేక్ తాగాలనిపించి ఓ వ్యక్తి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. మిల్క్ షేక్‌కు(Milkshake) బదులుగా టాయిలెట్‌తో నిండిన స్టైరోఫోమ్ కప్పు వచ్చింది. అది చూసి నిర్ఘాంతపోయాడు కస్టమర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు సదరు వ్యక్తి. ఫాక్స్ 59 ప్రకారం.. అమెరికాలోని ఉతాకు చెందిన కాలేబ్ వుడ్స్.. ఫుడ్ డెలివరీ యాప్ గ్రబ్‌హబ్ నుంచి చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్లో ఫ్రైస్, మిల్క్ షేక్‌ను ఆర్డర్ చేశాడు. కాసేపటి తరువాత ఇంటికి ఆర్డర్ వచ్చింది. మిల్క్ షేక్‌ని సిప్ చేయడానికి బాటిల్లో స్ట్రా పెట్టి.. ఒక సిప్ తాగాడు. అయితే, టేస్ట్ తేడా కొట్టడంతో ఆ బాటిల్ మూత తీసి చూశాడు. ఇంకేముంది.. అందులో టాయిలెట్ ఉంది. దెబ్బకు షాక్ అయ్యాడు అతడు. ఆ తరువాత ఏం జరిగిందో అతని మాటల్లోనే తెలుసుకుందాం..
‘నాకు ఫుడ్ డెలివరీ చేసిన తరువాత.. భోజనం చేస్తున్నాను. అప్పుడే వచ్చిన మిల్క్ షేక్ కప్‌లో స్ట్రా వేసి ఒక సిప్ తాగాను. ఆ కప్‌లో ఉన్నది టాయిలెట్ అని గ్రహించాను. వెంటనే డెలివరీ బాయ్‌కి రిటర్న్ కాల్ చేసి పిలిపించాను. అతనితో ఘర్షణకు దిగాను. నేను మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే.. టాయిలెట్ బాటిల్ ఎలా ఇస్తారు? అని అతన్ని నిలదీశాను. దాంతో జరిగిన పొరపాటును డ్రైవర్ గ్రహించి వివరణ ఇచ్చాడు. అతని వాహనంలో రెండు స్టైరోఫోమ్ కప్పులు ఉన్నాయని, దాంతో కన్ఫ్యూజ్ అయ్యాయని డ్రైవర్ చెప్పాడు. ఎక్కువ గంటల పని చేయడం కారణంగా బాత్రూమ్ కోసం బ్రేక్ తీసుకోనని, ఆ కారణంగా తన కారులో డిస్పోజబుల్ కప్పులలో టాయిలెట్ ఫినిష్ చేస్తానని డ్రైవర్ చెప్పాడు.’ అని చెప్పుకొచ్చాడు కాలేబ్.
ఈ ఘటన తరువాత కాలేబ్.. నేరుగా గ్రబ్హబ్ను కాంటాక్ట్ అయ్యాడు. జరిగిన మ్యాటర్‌ను వివరించాడు. తన మనీ తనకు రిటర్న్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. దాంతో గ్రబ్‌హబ్ కూడా అంగీకరించింది. అయితే, ఈ రిటర్న్ డబ్బులు రావడానికి 4 రోజులు పట్టింది. వచ్చిన రిటర్న్స్ కూడా పూర్తిగా రాలేదని సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే.. గ్రబ్‌హబ్ డెలివరీ పార్ట్నర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: