Uday Kiran: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా జోరుగా సాగుతోంది. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాలు మరో సారి థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాలను మళ్ళీ కొత్తగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఒకప్పుడు హిట్ టాక్ రాని సినిమాలు కూడా రీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు పోకిరితో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో సూపట్ హిట్ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read: Actress Vijayalakshmi: నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను .. నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో..!
ఉదయ్ కిరణ్
ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకి వచ్చిన హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. కెరీర్ స్టార్ చేసిన కొంత కాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా ఎదుగుతారని ఊహించిన ఉదయ్.. అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కానీ ఉదయ్ మరణించి ఇంత కాలమైన.. ఇప్పటికీ ఆయన నటించిన సినిమాలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. వాటిలో మొదటగా గుర్తొచ్చే చిత్రం ‘నువ్వు నేను’. ఇప్పుడు ఈ సినిమానే రీ రిలీజ్ కు సిద్ధమైంది.
నువ్వు నేను రీ రిలీజ్
ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించిన సినిమా ‘నువ్వు నేను’. 2001లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. అద్భుతమైన ప్రేమ కథగా యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా.. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. మార్చి 21న రీ రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో ఉదయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస