TTD Recruitment for Degree Lecturer Posts: ఏపీలోని టీటీడీ శాశ్వత ప్రాతిపదికన టీటీడీ డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, అలాటే టీటీడీ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో మొత్తం 78 పోస్టులకు భర్తీ చేస్తున్నారు. వీటిలో కూడా డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49, జూనియర్ లెక్చరర్ 29 పోస్టులు ఉన్నాయి. ఏపీలోని హిందూమతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
సబ్జెక్టుల వారీ ఖాళీలు:
– బోటనీ- 3
– కెమిస్ట్రీ- 2
-కామర్స్- 9
-డెయిరీ సైన్స్- 1
-ఎలక్ట్రానిక్స్- 1
-ఇంగ్లిష్- 8
-హిందీ- 2
-హిస్టరీ- 1
-హోమ్ సైన్స్- 4
-ఫిజికల్ ఎడ్యుకేషన్- 2
-ఫిజిక్స్- 2
-పాపులేషన్ స్టడీస్- 1
-సంస్కృతం- 1
-సంస్కృత వ్యాకరణం- 1
-స్టాటిస్టిక్స్- 4
– తెలుగు- 3
– జువాలజీ- 4
అర్హత:
కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటుగా నెట్, స్లెట్ అర్హత సాధించి ఉండాలి.
సబ్జెక్టుల వారీ ఖాళీలు:
బోటనీ- 4
కెమిస్ట్రీ- 4
సివిక్స్- 4
కామర్స్- 2
ఇంగ్లిష్- 1
హిందీ- 1
హిస్టరీ- 4
మ్యాథమెటిక్స్- 2
ఫిజిక్స్- 2
తెలుగు- 3
జువాలజీ- 2
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01.07.2023నాటికి 18ఏళ్ల నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులు పదేళ్ల సడలింపు ఉంది. నెలకు డిగ్రీ లెక్చరర్ కు రూ. 61 వే నుంచి లక్షల రకు ఉంటుంది. జూనియర్ లెక్చరర్లకు రూ. 57వేల నుంచి లక్షపైనే ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.tirumala.org/ ని సందర్శించండి.
ఇది కూడా చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఈ రూల్ పాటించకుంటే నుమాయిష్ కు నో ఎంట్రీ!