TS ECET : పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic Diploma), బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. మే 6న ఈసెట్ పరీక్ష (ECET Exam) నిర్వహించారు. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆధ్వర్యంలో ఈసెట్ పరీకను నిర్వహించారు.
ఈ https://ecet.tsche.ac.in/ లింక్ లో ఈసెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు. ముందుగా లింక్ మీద క్లిక్ చేయాలి. అనంతరం హోం పేజీ ఓపెన్ అవుతుంది. హోం పేజీలో కనిపించే రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి.. సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫలితాలను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి..