గత రెండు రోజులుగా భక్తులు పోటెత్తారు. పాఠశాలల పరీక్షలు ముగియగానే అనేక రాష్ట్రాల్లో వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం రోజుకు 20 వేల మందికి ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లను విక్రయించడంతో పాటు రోజుకు 20 వేల ఉచిత టిక్కెట్లను కూడా అందజేసింది.కాగా వైకుంట కాంప్లెక్స్‌లోని 31 గదులన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉచిత దర్శన భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 గంటలకు పైగా వేచి చూడాల్సి న పరిస్థితి నెలకొంది.
ఈ మేరకు తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా రేపు ఉదయం వరకు ఉచిత దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్వామివారి దర్శనం కోసం వేచి చూడాల్సి వచ్చింది.