టమాటా లేకపోతే రోజు గడవని వారు ఎంతో మంది ఉంటారు. మూడు పూటల్లో ఏదో ఒక పూటలో తప్పకుండా టమాటా ముక్కను టేస్ట్ చేస్తారు. అయితే.. టమాటాను జ్యూస్ చేసుకొని తాగడం మాత్రం చాలా మందికి తెలియదు. ఉదయాన్నే పరగడపున టమాటా రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. నిత్యం ఒక గ్లాసు టామాటా రసం తాగడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి ? టమాటా జ్యూస్లో ఉన్న పోషకాలేంటి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
టమాటాలను జ్యూస్ చేసుకుని ఉదయాన్నే పరగడపున తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. టమాటా రసం తాగడం వల్ల రోజంతా శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయని అంటున్నారు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
టమోటా రసం బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఎందుకంటే జ్యూస్లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారు రసం తాగడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించి, అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుందని నిపుణులంటున్నారు.రోజు ఉదయాన్నే టమోటా రసం తాగడం వల్ల చర్మం యవ్వవనంగా, ఆరోగ్యవంతంగా ఉంటుందట. వీటిలో ఉండే విటమిన్ సి చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టమోటాలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.