Winter Tips: చలికాలంలో వాతావరణంలోని మార్పులు ఆరోగ్యం పై కూడా చాలా ప్రభావం చూపుతాయి. అంతే కాదు చలికాలంలో తరచూ జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు, నిమోనియా, సైనస్ వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవి ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తాయి. పిల్లలు ఇలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.
వ్యాక్సినేషన్
చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలి. క్రమం తప్పకుండా సరైన సమయంలో వ్యాక్సినేషన్ వేయించడం వల్ల పిల్లలు జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
పరిసరాల పరిశుభ్రత
పరిసరాల పరిశుభ్రత పిల్లల ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావం చూపుతుంది. పిల్లలు ఉండే ప్రదేశాలను శుభ్రంగా శానిటైజ్ చేయాలి. అలాగే వాళ్ళు ఆడుకునే బొమ్మలు లేదా వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి శానిటైజ్ చేయాలి.
హ్యాండ్ హైజీన్
తల్లిదండ్రులు పిల్లలకు హ్యాండ్ హైజీన్ పై అవగాహన కల్పించాలి. చేతులు శుభ్రం చేయకపోతే.. క్రిములు, బ్యాక్టీరియా ఆహారం ద్వారా లోపలికి వెళ్లి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని పిల్లలు తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా అలవాటు చేయాలి.
మంచి పోషకాహారాలు ఇవ్వాలి
రోజూ తినే ఆహారంలో పిల్లలకు పోషకాహారాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే.. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. దీని వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉంచండి
జలుబు, దగ్గు సమస్యలు ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి పిల్లలను దూరంగా ఉంచాలి. దీని వల్ల పిల్లలకు జబ్బులు వ్యాపించే అవకాశం తక్కువగా ఉండును. ముఖ్యంగా సైనస్ , నిమోనియా ఉన్న పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లేదంటే పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
Also Read: Drinking Water: రోజూ నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా.. !