Kitchen Tips: సాధారణంగా పచ్చి కొబ్బరిని ఎండబెట్టిన తర్వాత వచ్చేదే ఎండుకొబ్బరి. ఇంట్లో తయారు చేసుకునే వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి రుచికరమైన టేస్ట్ తో పాటు వంటకానికి మంచి ఫ్లేవర్ అందిస్తుంది. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వీటికి ఫంగస్ లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. తడిగా స్టోర్ చేయడం, నిల్వ చేసే విధానం దీనికి కారణం కావచ్చు. కొందరు వీటిని స్టోర్ చేయడం ఇబ్బందిగా ఉండడంతో బయట నుంచి కొంటారు. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎండు కొబ్బరి కాలం పాటు ఎండు కొబ్బరి నిల్వ ఉంటుంది. అవేంటో చూడండి.
ఎండు కొబ్బరిని స్టోర్ చేయడానికి సింపుల్ టిప్స్
- కొంతమంది కొబ్బరిని బయటనే ఉంచేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే త్వరగా పాడవుతుంది. ఎందుకొబ్బరినీ ఎప్పుడూ కూడా ఒక బ్యాగ్ లేదా గాలి చేరని డబ్బాలో వేసి నిల్వ ఉంచాలి. అలాగే వాటికి పై నీళ్లు చేరకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల బాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉండదు.
- ఈ టిప్ కొందరికి తెలియకపోవచ్చు.. ఎండు కొబ్బరిని నిల్వ చేయడానికి ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా. కొబ్బరి గిన్నెలను డబ్బా లేదా సీసాలో నిల్వ చేసే ముందు లోపల కాగితం ఉంచండి. ఇలా ఉంచితే ఫ్రెష్ గా ఉంటుంది.
Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?
- పచ్చి కొబ్బరిని నిల్వ చేసేటప్పుడు ఇలా.. చేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని.. దాంట్లో కాస్త ఉప్పు వేయాలి. తరువాత ఆ నీటిలో కొబ్బరిని ముంచి.. పొడి గడ్డితో శుభ్రంగా తుడవాలి. పూర్తిగా ఎండిన తరువాత డబ్బాలో స్టోర్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
- కొబ్బరిని స్టోర్ చేసే ముందు.. వాటికి కాస్త నూనె రాసి.. ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత బాక్స్ లో స్టోర్ చేయాలి. ఇలా చేయడం ఎండు కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి సహాయపడుతుంది.
Also Read: Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి