Trisha Krishnan: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్స్ చేసిన హీరోయిన్ త్రిష ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ నెల 6వ తేదీన తమిళంలో ‘ది రోడ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది.సంగీత దర్శకుడు సామ్ సీఎస్ నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ వశీగరన్ దర్శకత్వం వహించాడు. మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ కథకు మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తమిళంలో ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతోంది. తమిళంలో ఆమె చేసిన ‘ది రోడ్’ సినిమా అక్కడ ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో త్రిష ‘మీరా’ పాత్రలో కనిపిస్తుంది. మీరా భర్త .. ఆమె కొడుకు ఇద్దరూ కూడా సరదా ట్రిప్ గా కార్లో కొడైకెనాల్ వెళతారు. అక్కడ జరిగిన ఒక ప్రమాదంలో వాళ్లిద్దరూ చనిపోతారు. ఊహించని ఈ సంఘటనతో మీరా బిత్తరపోతుంది. ఆ కేసుకి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉండగానే, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదేమో అనే అనుమానం ఆమెకి కలుగుతుంది.
దాంతో ప్రమాదం జరిగిన తీరును అనేక కోణాల్లో ఆమె పరిశీలించడం జరుగుతుంది. కచ్చితంగా అది ప్రమాదం కాదనే విషయం మీరాకి అర్థమైపోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె భర్త .. కొడుకు చనిపోవడం వెనుక ఎవరున్నారు? తను నమ్మిన విషయాన్ని ఆమె నిరూపించగలుగుతుందా? అనేదే కథ. సింపుల్ లైన్ అయినప్పటికీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో హీరోయిన్ త్రిషకు అవకాశాలు తగ్గిపోయి నెమ్మదించింది. కానీ తమిళంలో మాత్రం ఓ రేంజ్ లో దుమ్ముదులుపుతోంది. విజయ్ లియోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏరికోరి ఆమెనే తీసుకోవడం ఒక ఉదాహరణ మాత్రమే. పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ తో సహా తన సాటి వాళ్ళను పూర్తిగా డామినేట్ చేసేలా గ్లామర్ తో వావ్ అనిపించడం తనకే చెల్లింది. త్రిషకు హీరోలతో పాటు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా గట్టిగా వస్తున్నాయి.
Also Read: ఆ స్టార్ హీరోతో లిప్ లాక్..నెట్టింట్లో వైరల్..!!