టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారిపోయాడు. రేపటి(అక్టోబర్ 5) నుంచి ప్రపంచ కప్ ప్రారంభం అవుతుండగా.. ఇవాళ(అక్టోబర్ 14) జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రోహిత్ శర్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కెప్టెన్లందరూ ఒకే చోట దర్శనమివ్వగా.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. వీటిలో చాలా ఆన్సర్లకు అక్కడ ఉన్న వాళ్లు ఫుల్‌గా నవ్వారు. వెటకారం, చమత్కారంతో జోకులు పేల్చే రోహిత్ శర్మ ఫుల్‌గా నవ్వించాడు. ఇక ప్రెస్ కాన్ఫెరెన్స్ తర్వాత కూడా రోహిత్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. WWE స్టార్స్‌లో ఒకరైనా ది గ్రేట్ ఖలీతో కలిసి రోహిత్ ఓ ఫొటో దిగాడు. ఇది సోషల్‌మీడియాలో మీమ్ ఫెస్ట్‌కి కారణమైంది. ఎవరికి వారు తమకు నచ్చిన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు.
Rohit Sharma meets Great Khali. pic.twitter.com/oN7sIqEOiG
— Johns. (@CricCrazyJohns) October 4, 2023
Reminded me of this tweet 😭 pic.twitter.com/gWvTZBkR9x
— 𝙍𝘿𝙆 #LEO (@Goatcheeku_18) October 4, 2023
— Guddu (@nammu_92) October 4, 2023
Khali looks like Great Wall of China infront of Rohit
— Anshu Chauhan (@chauhandwarrior) October 4, 2023
Rohti Height+ Pant Height= Khali Height
— 𝑺𝒂𝒍𝒎𝒂 (@SalmaIqbalKhan) October 4, 2023
చరిత్రలో మొట్టమొదటి భారత సంతతికి చెందిన ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ ఖలీ. దేశంలో అత్యంత ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరు ఖలీ. 2021లో డబ్ల్యుడబ్ల్యుఇ(WWE) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చడం ద్వారా డబ్ల్యుడబ్ల్యుఇ ఖలీని గౌరవించింది. అతను 2000లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ అరంగేట్రం చేశాడు. తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ వృత్తిని ప్రారంభించడానికి ముందు, అతను పంజాబ్ పోలీసులో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. నాలుగు హాలీవుడ్ సినిమాలు, రెండు బాలీవుడ్ సినిమాలు, పలు టెలివిజన్ షోలలో నటించాడు. 2015లో స్థాపించిన దేశపు అతిపెద్ద ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్ కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు , ప్రధాన కోచ్ కూడా. 2 జనవరి 2006న, ఖలీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE)తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్ అయ్యాడు. WWE ఎంట్రీలోనే అండర్టేకర్ లాంటి లెజెండ్‌ని మట్టికరిపించి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు ఖలీ.. తాజాగా రోహిత్ శర్మతో కలిసి ఫొటోలో మెరిశాడు.
ALSO READ: ధోనీ ఫ్యాన్స్‌కు అశ్విన్ ఝలక్.. గంభీర్ గురించి అలా మాట్లాడతారా?