Actor Vijay: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 324 నియోజకవర్గాల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించి పార్టీ పనులపై దృష్టి పెట్టారు, దళపతి విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కజగం పార్టీ జెండాను గురువారం ఆవిష్కరిస్తారనే వార్తలను విజయ్ నిజం చేశారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి తన అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ…మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా..విజయ పతాకం అంటూ తెలిపారు. అంతేకాకుండా కేవలం జెండాను మాత్రమే కాకుండా కజగం పాటను కూడా విడుదల చేశారు.
ఇప్పటి నుండి మన జెండా దేశవ్యాప్తంగా ఎగురుతుంది”. ఇకపై తమిళనాడు గెలుస్తుందని… విజయం ఖాయమని విజయ్ అన్నారు. తమిళనాడు విక్టరీ కజగం పతాకాన్ని ప్రధాన కార్యాలయ సచివాలయంలో ఆవిష్కరించారు. రెండు రోజుల క్రితం పనయూర్లోని ప్రధాన కార్యాలయ సచివాలయంలో విజయ్ తమిళనాడు విక్టరీ కజగం పార్టీ జెండాను ఎగురవేసి రిహార్సల్ చేస్తున్న ఫొటోలు విడుదలై వైరల్గా మారిన సంగతి తెలిసిందే.