అబార్షన్ పిటిషన్ దేశ అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. బతికే అవకాశాలున్న పిండాన్ని తాము చంపలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఓ మహిళకు 26వారాల అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని న్యాయస్థానం ఈ సంచలన తీర్పును ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషన్ అనుమతి కోరుతున్నారా అంటూ సీజేఐ ప్రశ్నించారు. బతికేందుకు అవకాశాలున్న ఉన్న పిండాన్ని తాము చంపలేమని స్పష్టం చేశారు.
అసలు ఈ కేసు ఏంటంటే…
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చేరుకుంది. మెడికల్ అబార్షన్ కేసులో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అబార్షన్ కు అనుమతి ఇచ్చింది. అబార్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మానసికంగా, ఆర్థికంగా, మూడో బిడ్డను కనే పరిస్థితి లేదని, డిప్రెషన్‌తో బాధపడుతోందని గుర్తించిన సుప్రీంకోర్టు సోమవారం ఆమె గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు అక్టోబర్ 9న అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి: సేమ్ సెక్స్ వివాహాలకు ఓకే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
తల్లిహక్కుతోపాటుగా గర్భస్థ శిశువ హక్కుల మధ్య సమతుల్యం పాటించాలని..ఆ పిండం సజీవంగా ఉందని పేర్కొంది. ఆ పిండం గుండె చప్పుడును ఆపమని ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ బిడ్డను మేము చంపలేమంటూ వ్యాఖ్యానించింది. దీంతో కోర్టు అబార్షన్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం ఈ సంచలన తీర్పును ఇచ్చింది. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అబార్షన్‌పై దేశ చట్టం ఏం చెబుతోంది?
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం, గర్భం రద్దు చేయడానికి గరిష్ట పరిమితి 24 వారాలు కావడం గమనార్హం. వివాహిత స్త్రీలు, అత్యాచార బాధితులు, వికలాంగులు, మైనర్లు వంటి ఇతర బలహీన మహిళలతో సహా ప్రత్యేక వర్గాల మహిళలకు అబార్షన్లు చేయడానికి మెడికల్ బోర్డు, కోర్టు అనుమతి అవసరం.