Tension in Haryana Holiday for educational institutions and banks: హర్యానాలోని నుహ్ గత నెలరోజులు అల్లర్లతో అట్టుడుకుంది. ఈ మధ్యే కాస్త తేరుకున్న నుహ్….మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే హర్యానాలోని నుహ్‌లో జరిగిన బ్రజ్ మండల్ యాత్రపై పోలీసు యంత్రాంగం, విశ్వహిందూ పరిషత్ మధ్య వాగ్వాదం జరిగింది. నేడు శ్రావణమాసం చివరి సోమవారం, దీనిని దృష్టిలో ఉంచుకుని విశ్వహిందూ పరిషత్ నుహ్‌లో జలాభిషేక యాత్రను ప్రకటించింది.
మరోవైపు, శాంతిభద్రతలను ఉటంకిస్తూ యాత్రను అనుమతించడానికి పోలీసు యంత్రాంగం నిరాకరించింది. అయితే శోభా యాత్రను ఎట్టిపరిస్థితిలో చేపట్టితీరుతామని VHP మొండిగా ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బ్రజమండల్ యాత్ర చేపట్టనున్నట్లు వీహెచ్‌పీ ప్రకటించింది. వీహెచ్‌పీ ప్రకటన దృష్ట్యా నుహ్‌లో 144 సెక్షన్ విధించారు. జిల్లాలో 30 మంది పారా మిలటరీ ఫోర్స్‌ను మోహరించారు, ఎక్కడ చూసినా పోలీసు సిబ్బంది కనిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పర్యాటకులకు శుభవార్త…మొఘల్ గార్డెన్లో ఉద్యాన మహోత్సవము ప్రారంభం..!!
నుహ్‌లో ఇంటర్నెట్ సేవ నిలిపివేశారు. ఈరోజు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, నల్హాద్ మహాదేవ్ ఆలయం చుట్టూ, పోలీసులు 2 కిమీ విస్తీర్ణంలో బారికేడ్లు పెట్టారు. బారికేడ్ దాటి వెళ్లేందుకు వాహనాన్ని అనుమతించరు. VHP వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్వయంగా యాత్రలో చేరడానికి నుహ్‌కు చేరుకున్నారు, అయితే పరిపాలన మొత్తం నుహ్‌లో 144 సెక్షన్ విధించింది. బయటి వ్యక్తులెవరూ నుహ్లోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.
-నుహ్ జిల్లా సరిహద్దులన్నీ మూసివేశారు.
-నుహ్ 8 పోలీస్ స్టేషన్ ఏరియాగా విభజించారు.
-ప్రతి పోలీస్ స్టేషన్లో 1 IPS అధికారిని నియమించారు.
-57 మంది స్పెషల్ డ్యూటీ మేజిస్ట్రేట్లను నియమించారు.
-పాఠశాలలు-కళాశాలలతో పాటు బ్యాంకులు, మార్కెట్లు, కోర్టులు అన్నింటికీ సెలవు ప్రకటించారు.
-ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు.
ఇది కూడా చదవండి: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!
నుహ్తో పాటు నాలుగు రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. హర్యానాతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు తమ ప్రాంతాల్లో తమను తాము సిద్ధం చేసుకున్నారు. . 1900 మంది హర్యానా పోలీసు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. దీంతో పాటు 500 మంది పోలీసు సిబ్బందిని అల్లర్ల నిరోధక బృందంలో మోహరించారు. 26 కంపెనీ పారా మిలిటరీ ఫోర్స్, 3 కంపెనీ హర్యానా ఆర్మ్డ్ ఫోర్స్ జవాన్లను మోహరించారు .నుహ్తో పాటు హర్యానాలోని గురుగ్రామ్ , సోహ్నా, పల్వాల్, మనేసర్, ఫరీదాబాద్, సోనిపట్‌లలో కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రైతు సంస్థలు తెలిపాయి.