Telangana Ex CM KCR: తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని.. ఓ పుస్తకాన్ని చదువుతున్నారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన్ను ఫోటో తీసిన ఎంపీ సంతోష్ (MP Santhosh).. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. అయితే, కేసీఆర్ ఫోటోను షేర్ చేసిన సంతోష్.. ‘నిజయమైన నాయకత్వం క్లిష్ట సమయాల్లోనూ రెట్టించి ఉత్సాహంతో పని చేస్తుంది. పఠనంలో లీనమైపోయిన విధానం చూస్తుంటే.. పఠనం, జ్ఞానం పట్ల ఆయన అభిరుచిని తెలియజేస్తుంది. అంకితభావం, స్థితిస్థాపకతను తెలియజేస్తుంది. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆలోచనలన్నీ మీతోనే ఉన్నాయి.’ అంటూ కేసీఆర్ పుస్తకం చదువుతున్న ఫోటోను షేర్ చేశారు జోగినపల్లి సంతోష్.
కేసీఆర్ చదువుతున్న పుస్తకం ఇదే..
సంతోష్ షేర్ చేసిన ఫోటోలో కేసీఆర్ ఒక పుస్తకం చదువుతున్నారు. ఈ పుస్తకం చాలా విలువైనది. భారతదేశం, చైనా ఆర్థిక విధానాల గురించి తెలియజేసే ”ది డ్రాగన్ & ది ఎలిఫెంట్’ పుస్తకం (‘The Dragon & The Elephant’ synopsis). ఇందులో భారతదేశం, చైనా దేశాలు (India and China) అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, అమలు చేస్తున్న విధానాలు పేర్కొనడం జరిగింది. ఈ ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఫోటోను చూసి బాస్ ఈజ్ బ్యాక్, దటీజ్ కేసీఆర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#KCR is reading ‘The Dragon & The Elephant’ synopsis which talks about the economic policies of India and China. https://t.co/0RV3UZxEbn
— Krishnamurthy (@krishna0302) December 13, 2023
Also Read:
ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?