Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల వరకు 66 శాతంగా ప్రకటించింది ఎన్నికల సంఘం. క్యూలైన్లలో ఉన్నవారు మొత్తం ఓటేస్తే 70 శాతం దాటే అవకాశముంది. పలు జిల్లాల్లోని పోలింగ్ బూత్‌లలో ఓటర్లు భారీగా బారులు తీరి ఉన్నారు. 5 గంటల వరకు క్యూలైన్లలో నిలబడ్డ వారందరికీ ఓటు హక్కు కల్పించారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేందుకు సమయం పడుతుందని ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. జిల్లాల వారీగా చూసుకుంటే మెదక్‌లో అత్యధికంగా 80.28 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 39.97 శాతం పోలింగ్ పోలింగ్ నమోదు అయింది. అలాగే నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా జనగామ నియోజకవర్గంలో 83.34 శాతం ఓటింగ్ నమోదవగా.. యాకుత్‌పుర సెగ్మెంట్లో అత్యల్పంగా 27.87 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇదే..
ఆదిలాబాద్ – 73.58 శాతం
భద్రాద్రి – 66.37 శాతం
హనుమకొండ – 62.46 శాతం
హైదరాబాద్ – 39.97 శాతం
జగిత్యాల – 74.87 శాతం
జనగాం – 80.23 శాతం
భూపాలపల్లి – 76.10 శాతం
గద్వాల్ – 73.60 శాతం
కామరెడ్డి – 71.00 శాతం
కరీంనగర్ – 69.22 శాతం
ఖమ్మం – 73.77 శాతం
ఆసిఫాబాద్ – 71.63 శాతం
మహబూబాబాద్ – 77.50 శాతం
మహబూబ్ నగర్ – 73.70 శాతం
మంచిర్యాల – 70.71 శాతం
మెదక్ – 80.28 శాతం
మేడ్చల్ – 49.25 శాతం
ములుగు – 75.02 శాతం
నాగర్ కర్నూల్ – 70.83 శాతం
నల్గొండ – 75.72 శాతం
నారాయణపేట – 67.70 శాతం
నిర్మల్ – 71.47 శాతం
నిజామాబాద్ – 68.30 శాతం
పెద్దపల్లి – 69.83 శాతం
సిరిసిల్ల – 71.87 శాతం
రంగారెడ్డి – 53.03 శాతం
సంగారెడ్డి – 73.83 శాతం
సిద్దిపేట – 77.19 శాతం
సూర్యాపేట – 74.88 శాతం
వికారాబాద్ – 69.79 శాతం
వనపర్తి – 72.60 శాతం
వరంగల్ – 73.04 శాతం
యాదాద్రి – 78.31 శాతం
Also Read:
హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!