ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర శాసనమండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…ఖాళీగా ఉన్న 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. మెరుగైన విద్యాను రాష్ట్రంల అందిస్తున్నామని బొత్స వెల్లడించారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఏపీలో 40వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు అన్నారు. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఎనిమిదివేల టీచర్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారని..సరికాదన్నారు. మెగా డీఎస్సీని ప్రకటించాలని లక్ష్మణ రావు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: గురుకుల అభ్యర్థులకు కీలక అలర్ట్.. అలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్.!!
మరోవైపు తెలంగాణ సర్కార్ 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎససీ నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుందని పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టీఆర్టీ దరఖాస్తు ఫీజు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే టీఆర్టీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా తెలంగాణ టీఆర్టీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది.
కాగా తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. మారిన సిలబస్.. ఈ టాపిక్స్ చదవండి..!!
గురుకుల బోర్డు నిర్దేశించిన ప్రకారం అర్హత పరీక్షలు రాసిన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్స్ సమర్పించే ఛాన్స్ ఉంటుంది. బోర్డు నిర్దేశించిన తేదీల్లో ఆయనా పోస్టులకు మంజూరైన అభ్యర్థులు ముందుగా సొసైటీ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే సొసైటీ ఆప్షన్ల వారీగా ప్రాధాన్యత ప్రకారం ఆయా సొసైటీల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అదేవిధంా జోనల ప్రాధాన్యతలకు కూడా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో జోన్ల ఆప్షన్ కు అనుగుణంగా అభ్యర్థులకు ఆయా జోన్లలో పోస్టింగ్ ఇవ్వనున్నట్ల గురుకుల బోర్డు తెలిపింది. కాగా సొసైటీలు, జోన్ల ఆప్షన్స్ సెలక్షన్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒకసారి సెలక్ట్ చేసుకన్న తర్వాత వాటిని మళ్లీ సవరించేందుకు ఎలాంటి అవకాశం ఉండదని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అత్యంత జాగ్రత్తగా ఆప్షన్స్ సమర్పించాలని గురుకులాల బోర్డు తెలిపింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే!
సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు – ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( TGT) పోస్టులకు ఆప్షన్స్ ఇవ్వాలి. -అక్టోబర్ 3 నుంచి 9 వరకు – పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ డ్రాయింగ్, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ టీచర్లు ఆప్షన్స్ ఇవ్వాలి.